English | Telugu

ఆది - ర‌కుల్‌... ఓ ఎంగిలి ముద్దు

కొత్త హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాగా రెచ్చిపోతోంది. సినిమా సినిమాకీ గ్లామ‌ర్ డోస్ పెంచేస్తోంది. మొన్న క‌రెంటు తీగ‌లో నాభి అందాల్ని చూపించి కుర్ర‌కారుని ఆకట్టుకొంది. ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌లో దిగిపోయింది. ఆదికి ఓ ఘాటైన ఎంగిలి ముద్దు ఇచ్చింది. 'ర‌ప్‌' సినిమా కోసం. ఆది, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన చిత్రం ర‌ఫ్‌. ఈ సినిమాలో ర‌కుల్‌, ఆదిల మ‌ధ్య లిప్ లాక్ సీన్ ఉంది. ట్రైట‌ర్లోనే ఆదే క‌ట్ చేసి.. అంద‌రినీ ఊరిస్తున్నారు. కొత్త‌మ్మాయిల్లో రెజీనా ఇప్ప‌టికే లిప్‌లాక్‌ల విష‌యంలో దూసుకుపోతోంది. ఇప్పుడు ర‌కుల్ కూడా పోటీకి వ‌చ్చేసింద‌న్న‌మాట‌. ర‌ఫ్‌లో ర‌కుల్ అందాలు, ఈ లిప్ లాక్ స్పెష‌లాఫ్ ఎట్రాక్ష‌న్ అని చిత్ర‌బృందం భావిస్తోంది. ఆది కూడా ష‌ర్టు విప్పి కండ‌లు చూపించాడు. త‌న సిక్స్ ప్యాక్ బాడీతో మాస్‌ని ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇవ‌న్నీ ఈ సినిమాని ఎంత వ‌ర‌కూ గ‌ట్టెక్కిస్తాయో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.