English | Telugu

'చక్కిలి గింత'లు పెడతారా..!

'తూనీగాతూనీగా' చిత్రం తో కధానాయకుడిగా పరిచయమైన సుమంత్ అశ్విన్ 'చక్కిలి గింత' పెట్టడ్డానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దగ్గర సహాయకునిగా పనిచేసిన వేమారెడ్డి ఈ చిత్రం ద్వార దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కు తగట్టే సాఫ్ట్ గా, క్లాసీ గా, రొమాంటిక్ గా వుంది ఫస్ట్ లుక్. సుకుమార్‌ మాట్లాడుతూ ''నేనూ, వేమారెడ్డి, మరో దర్శకుడు ప్రకాష్‌ తోలేటి ఒకేసారి మా ప్రయాణం ప్రారంభించాం. కష్టసుఖాలు పంచుకొన్నాం. వేమారెడ్డి ఇప్పుడు దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. పాటలు విన్నాను.. బాగున్నాయి.'' అని అన్నారు. రెహానా అనే కొత్తమ్మాయి ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.