English | Telugu
రజనీ సినిమాకు విలన్ ఇతగాడే..!
Updated : May 12, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న సినిమా కబాలీ. వయసైపోయిన గ్యాంగ్ స్టర్ పాత్రలో రజనీ, ఆయన సరసన రాధికా ఆప్టే నటిస్తున్నారు. సినిమా మొత్తం బ్యాంకాక్ లో జరుగుతుంది. దాంతో బ్యాంకాక్ విలన్ ఉండేలా విన్‌స్టన్ చావొ అనే తైవాన్ నటుడిని విలన్ గా కాస్టింగ్ చేశారు. మూవీ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను, ఈ నటుడి ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కబాలీకి డబ్బింగ్ చెప్పడానికి చావొ చెన్నై వచ్చాడట. దీంతో కబాలీలో విలన్ ను రజనీ అభిమానులకు పరిచయం చేయడం కోసం, ఆ ఫోటోను తన ట్విట్టర్లో పెట్టారు. రజనీ కబాలీ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ప్రపంచంలో యూట్యూబ్ లో అత్యధికంగా చూసిన ఆల్ టైం మూవీ టీజర్లలో 50 ప్లేస్ కు చేరుకుంది కబాలీ. టీజర్ కే రెస్పాన్స్ ఇలా ఉందంటే, ఇంక సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రజనీ ఫ్యాన్స్..