English | Telugu

రజనీకాంత్ కు నిర్మాతల మద్దతు

లింగా సినిమాపై వివాదాల నేపథ్యంలో తమిళ నిర్మాతల సంగం రజనీకాంత్ కు మద్దుతుగా నిలిచింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లింగా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు రజనీకాంత్ తమకు నష్ట పరిహారం ఇవ్వాలని చాన్నాళ్ళుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లుకు మధ్య జరిగిన చర్చలు కూడా బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇంటిముందు బిక్షమెత్తుకుని తమ నిరసన వ్యక్తం చేయాలనీ డిస్ట్రిబ్యూటర్లు డిసైడ్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నిర్మాతల సంగం రజినీకాంత్ కు మద్దుతుగా నిలిచింది. రజనీకాంత్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని, అప్పుడు భారీగా లాభాలు పొందిన డిస్ట్రిబ్యూటర్లు రజనీకాంత్ కు ఏమైనా ఇచ్చారా? అలానే లాభ నష్టాలకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే బాధ్యులని, వారికి రజనీకాంత్ నష్ట పరిహారం ఇవ్వాల్సిన పని లేదని వెల్లడించారు.