English | Telugu

ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ద్వారా నాగ్ రాజన్న పంపిణీ

ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ద్వారా నాగ్ "రాజన్న" పంపిణీ చేయబడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తూ, వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "రాజన్న". నిజాం నిరంకుశ పాలన మీద తిరగబడ్డ తెలంగాణా రైతుబిడ్డ పోరాటాన్ని ఈ "రాజన్న" చిత్రంలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది.

నాగ్ "రాజన్న" సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేయటానికి నిర్ణయించుకున్నారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో "ఢమరుకం" అనే సోషియో ఫాంటసీ సినిమాని భారీ బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో నిర్మిస్తూంది. నాగార్జున సినీ జీవితంలోనే అత్యంత అధిక బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మించబడుతుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.