English | Telugu
వారితో డీల్ సెట్ చేస్తున్న రాజమౌళి
Updated : Mar 14, 2016
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి ది బిగినింగ్' కు మించి ‘బాహుబలి ది కంక్లూజన్’ ను రెడీ చేస్తున్నాడు. నిజానికి ‘బాహుబలి ది కంక్లూజన్’ ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ కావాలి, కానీ... ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం. దీనికి కారణం ఫైనాన్స్ సమస్యలంట.. అవునండి ఇది నిజం... ఇంకా అర్థం కాలేదా.. అసలు విషయం ఏమిటంటే... 'బాహుబలి ది బిగినింగ్' సాధించిన విజయంతో ‘బాహుబలి ది కంక్లూజన్’లో నటించేందుకు నటీనటులు తమ పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేస్తున్నారట. ఈ సమస్యను రాజమౌళి తనదైన స్టైల్ లో ఈ డీల్స్ సెట్ చేసుకుంటున్న తరుణంలోనే బాహుబలి2 షూటింగ్ ఆలస్యమవుతోందనే విషయం.. ఆలస్యంగా బయటకొచ్చింది.