English | Telugu
శ్వేతాబసుకు అండగా టాలీవుడ్, బాలీవుడ్..!
Updated : Sep 10, 2014
ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతాబసు విషయంలో మీడియా,పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకూ కొంతమంది సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. లేటెస్ట్ గా శ్వేతాబసుకు మద్దతుగా హిందీ టీవీనటి సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు డైరెక్టర్ రాజమౌళి తన మద్దతు ప్రకటించాడు. సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలు ఇవి..? శ్వేతాబసు వ్యవహారంలో పట్టుబడిన వ్యాపారవేత్తకు ఎలాంటి శిక్ష పడింది? అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?మీడియాలో కథనాలు చూసిన శ్వేత బసు ఏదయినా అఘాయిత్యానికి పాల్పడితే దానికి బాధ్యులెవరు? సున్నితమైన విషయాన్ని ఎందుకు బజారుకీడ్చారు? ఈ ప్రశ్నలకు డైరెక్టర్ రాజమౌళి తన మద్దతు తెలిపారు.