English | Telugu

' రాజా చెయ్యి వేస్తే ' సెన్సార్ రిపోర్ట్..!

ప్రస్తుతం తెలుగు యువహీరోల్లో అత్యంత బిజీగా ఉన్నాడు నారారోహిత్. ఇప్పటికే ఈ ఏడాది తుంటరి, సావిత్రి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన నారావారబ్బాయి, రాజా చెయ్యి వేస్తే తో మళ్లీ బాక్సాఫీస్ ను అటాక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నారా రోహిత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో, నందమూరి తారకరత్న విలన్ గా చేయడం విశేషం. ఏప్రిల్ 29న థియేటర్లలో ఎంటర్ అవనున్న ' రాజా చెయ్యి వేస్తే ' సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యుబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కొద్దిగా యాక్షన్ డోస్ ఎక్కువ కావడంతోనే ఈ సర్టిఫికెట్ అని చెబుతున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన రాజా చెయ్యి వేస్తే ట్రైలర్, బ్యాగ్రౌండ్ మ్యూజక్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. తారకరత్న పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ ఇషా తల్వార్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి అనే కొత్త దర్శకుడు పరిచయమౌతున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.