English | Telugu
' రాజా చెయ్యి వేస్తే ' ఆడియో ఫంక్షన్లో బాలయ్య, చంద్రబాబు స్పీచ్
Updated : Mar 25, 2016
వరస సినిమాల హీరో నారా రోహిత్ నెక్స్ట్ మూవీ రాజా చెయ్యి వేస్తే ఆడియో రిలీజ్ విజయవాడలో నిర్వహించారు. ప్రదీప్ డైరెక్షన్లో వారాహి బ్యానర్ లో నారారోహిత్ చేస్తున్న ఈ మూవీ ఆడియో వేడుకకు ఎపీ సిఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ మూవీ టీజర్ ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, తారకరత్న విలన్ లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ట్రైలర్ కూడా ఆడియో ఫంక్షన్లో రిలీజ్ చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, నారా నందమూరి అభిమానులు కలిసి రావడం అనేది శుభపరిణామం అని అన్నారు. అభిమానుల్ని కుటుంబసభ్యులుగా వర్ణించి బాలయ్య విజిల్స్ వేయించారు. హీరోయిన్ ఇషా తల్వార్ ను తల్వార్ అంటే కత్తి, కత్తి మాత్రమే కాదు స్త్రీ అంటే శక్తి అంటూ వ్యాఖ్యానించారు బాలయ్య.
ఏపీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ, సినిమా ఫంక్షన్లలో ఏదో ఎనర్జీ ఉంటుంది. మా కుటుంబం ఇప్పటి వరకూ రాజకీయ కుటుంబంగా ఉంది. రోహిత్ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత, నారా కుటుంబం సినిమా కుటుంబంగా మారింది. రోహిత్ బాణంలా దూసుకుపోతున్నాడు. తారక్ కూడా విలన్ గా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈమధ్య కొన్ని సినిమాలు చూస్తే నిద్ర రాదు. భయంకరంగా ఉంటాయి. అలాంటి సినిమాలు తీయద్దని ప్రొడ్యూసర్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమాకు కావాల్సిన బెస్ట్ లొకేషన్స్ ఏపీలో ఉన్నాయి. షూటింగ్స్ కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.