English | Telugu

దర్శకుడిగా మారుతున్న రాహుల్ రామకృష్ణ.. కాకపోతే మీరు మాత్రం ఆ పని చెయ్యాల్సిందే 

తెలుగు సినిమా పరిశ్రమలో డిఫరెంట్ మాడ్యులేషన్ తో హాస్యాన్ని పండించగలిగే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కమెడియన్స్ లో 'రాహుల్ రామకృష్ణ'(Rahul Ramakrishna)కూడా ఒకడు. అర్జున్ రెడ్డి, చి.ల.సౌ, గీత గోవిందం, హుషారు, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురం, జాతిరత్నాలు వంటి పలు చిత్రాల్లో రాహుల్ రామకృష్ణ పోషించిన క్యారెక్టర్సే అందుకు ఉదాహరణ.

ఇప్పుడు రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా మెగా ఫోన్ చేపట్టనున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ 'ఎక్స్' వేదికగా ఈ విషయాన్ని తెలియచేసిన రామకృష్ణ నటనలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉద్దేశించి 'దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్, ఫోటోలని నా మెయిల్ కి పంపించగలరు అని పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, హీరో తో హీరోయిన్స్ ఎవరనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది. ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి నిర్మాతగా కూడా రాహుల్ రామకృష్ణ వ్యవహరిస్తునట్టుగా తెలుస్తుంది.

2016 లో కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' తో రాహుల్ రామకృష్ణ మొదటి మూవీ. ఆ మూవీలో యాదగిరి క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించడమే కాకుండా ఆ చిత్రానికి డైలాగ్ రైటర్ గా కూడా పని చేసాడు. భరత్ అనే నేను, ఆర్ఆర్ఆర్(RRR)వంటి చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగాను తన సత్తా చాటిన రామకృష్ణ, తన కెరీర్ లో ఇప్పటి వరకు సుమారు ముప్పై చిత్రాల దాకా చేసాడు. ఇండస్ట్రీలోకి రాక ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి దర్శకత్వం వహించాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.