English | Telugu
అనిరుధ్, దేవిశ్రీప్రసాద్ కి షాక్ ఇచ్చిన మిరాయ్ గౌరహరి
Updated : Sep 17, 2025
సంగీత ప్రపంచంలో 'దేవిశ్రీప్రసాద్(Devisriprasad)అనిరుధ్ రవిచందర్'(Anirudh Ravichander)కి ఉన్నపేరు ప్రఖ్యాతులు తెలిసిందే. ఎంత పెద్ద హీరో అయినా సరే, ఆ ఇద్దరు తమ చిత్రానికి సంగీతాన్ని అందించాలని కోరుకుంటారు. ప్రేక్షకులు కూడా ఆ ఇద్దరి సంగీతంలో వచ్చే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. జోనర్ ఏదైనా సరే, ముఖ్యంగా ఆ ఇద్దరు ఇచ్చే 'బిజిఎం'ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. సదరు 'బిజీఎం' తో సీన్ ఎలివేట్ అయ్యి సినిమా హిట్ రేంజ్ పెరిగిన సందర్భాలతో పాటు, సినిమా రిలీజ్ అయ్యాక కూడా ప్రేక్షకులని వెంటాడుతూనే ఉంటుంది. సంగీత ప్రపంచంలో ఆ ఇద్దరికి అంత గొప్ప పేరు ఉంది.
ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిరాయ్'(Mirai)ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 'గౌర హరి'(Gowra hari)అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమా రేంజ్ ని కూడా పెంచింది. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ కి చెందిన 'బిజీఎం' ని చాలా మంది రింగ్ టోన్స్ గా కూడా సెట్ చేసుకున్నారు. అంత పేరు ఈ చిత్రంలోని సంగీతానికి వచ్చింది. చిత్ర విజయాన్ని పురస్కరించుకొని నిన్న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 'మిరాయ్' సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి 'ఉండి' నియోజకవర్గ ఎంఎల్ఏ, 'ఆంధ్రప్రదేశ్' అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 'రఘురామకృష్ణంరాజు'(Raghurama Krishnam Raju)ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.ఈ సందర్భంగా ఆయన 'గౌరహరి' ని ఉద్దేశించి మాట్లాడుతు 'గౌరహరి నా ఉండి వాసి, మిరాయ్ కి అందించిన మ్యూజిక్ చూస్తుంటే భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి మ్యూజిక్ డైరెక్టర్ కి తీసిపోడు. అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్ లని మించి మ్యూజిక్ ని ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. తేజ సజ్జ , మంచు మనోజ్, శ్రీయ, రితికా నాయక్ తో పాటు మిగతా నటి నటుల్ని, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)నిర్మాత 'విశ్వప్రసాద్'(TG Vishwaprasad)ని కూడా 'రఘురామకృష్ణంరాజు' అభినందించాడు.