English | Telugu

రామ్ చరణ్, సంపత్ నందిల రచ్చ జూన్ 1 నుంచి

రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" జూన్ 1 నుంచి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో రాం చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" చిత్రం ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.

రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" కోసం హీరో రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో అంతర్జాతీయ జిమ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" ఒక విభిన్నమైన మాస్ ఓరియెంటెడ్ కథనీ, ఇందులో అంతర్లీనంగా ఒక అందమైన ప్రేమ కథ కూడా జొప్పించారనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. తన తొలి చిత్రం "ఏమైంది ఈ వేళ" తోనే యువతను ఆకట్టుకున్న యువదర్శకుడు సంపత్ నంది ఈ "రచ్చ" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోని కలెక్షన్ల రికార్డులను రచ్చ రచ్చ చేయనున్నాడని సినీ వర్గాలంటున్నాయి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.