English | Telugu
విజయవాడతో మొదలుకానున్న'రభస'
Updated : Aug 28, 2014
వినాయక చవితి రోజున గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమవుతోంది యంగ్ టైగర్ 'రభస'. గత కొంతకాలంగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో చూస్తున్న ఈ సినిమా మొదటి షో ఎక్కడా పడుతుందని అనేది హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షో విజయవాడలో ఈ రోజు రాత్రి 12:30 నిమిషాలకు ప్రారంభం కానుందని సమాచారం. అలాగే హైదరాబాద్ కూకట్ పల్లి భ్రమరాంబలో మొదటి షో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ లో 'రభస' థియేటర్లన్ని మొదటి రోజు హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ లో పాజిటివ్ బజ్ ఉంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.