English | Telugu
హెవీ రెయిన్స్‌లో భారీ ఓపెనింగ్స్ తో‘రభస’
Updated : Aug 31, 2014
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస’. ఈ చిత్రం ఆగస్ట్ 29న వినాయక చవితి కానుకగా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఒక్కరోజులోనే నైజాంలో 2 కోట్ల 43 లక్షల షేర్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘రభస’ నిలిచిందని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ శ్రీవెంకటేశ్వర ఫిలింస్ వారు తెలిపారు.
ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ‘‘హెవీ రెయిన్స్‌లో సైతం భారీ ఓపెనింగ్స్‌తో మా ‘రభస’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నైజాంలో ఒక్కరోజులోనే 2 రెండు కోట్ల 43 లక్షల షేర్ సాధించి ఎన్టీఆర్ చిత్రాల్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘రభస’ నిలిచినందుకు చాలా హ్యాపీగా వుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుందని, ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్‌గానీ, సంతోష్ శ్రీన్‌వాస్ టేకింగ్‌గానీ, మేకింగ్‌గానీ చాలా ఎక్స్‌లెంట్‌గా వుందని రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్, మాస్, ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘రభస’ అందర్నీ ఆకట్టుకుంటున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఎన్టీఆర్‌తో చేసిన ఈ ఫస్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ కావడం, భారీ కలెక్షన్స్ సాధించడం ఆనందంగా వుంది’’ అన్నారు.