English | Telugu
అఖిల్‌కి నాన్న దొరికాడు
Updated : Mar 17, 2015
ఈ మధ్య తెలుగు తెరపై నాన్న పాత్రలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. యువ కథానాయకులే కాదు, సీరియర్ హీరోల సినిమాల్లోనూ నాన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు దర్శకులు. దాంతో హీరో, హీరోయిన్లకు సరిపోయే నాన్నలను వెదికిపట్టుకోవడం దర్శకులకు కాసింత కష్టంగా మారింది. ఈ పాత్రకు ఇది వరకు నాన్న అనగానే ప్రకాష్‌రాజ్ గుర్తొచ్చేవారు. ఇప్పుడు సరికొత్త ప్రత్యామ్నయాలు దొరికేస్తున్నాయి. జగపతిబాబు ప్రకాష్‌రాజ్ కి గట్టి పోటీ ఇస్తే.. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా రెఢీ అంటున్నాడు. 'శ్రీమంతుడు'లో మహేష్‌బాబుకి నాన్నగా నటిస్తున్నారు నటకిరీటి. ఇప్పుడు.. అఖిల్‌కీ ఆయనే నాన్న. అఖిల్ - వినాయక్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అఖిల్‌కి నాన్నగా రాజేంద్ర ప్రసాద్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ టీమ్‌తో రాజేంద్ర ప్రసాద్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి.