English | Telugu
లేహ్ వరదల్లో చిక్కుకుపోయిన హీరో
Updated : Aug 28, 2025
సఖి, చెలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆర్ మాధవన్(R Madhavan). తమిళంతో పాటు పలు హిందీ చిత్రాల్లోను నటించిన మాధవన్ మొన్న ఏప్రిల్ లో అక్షయ్ కుమార్ తో కలిసి 'కేసరి చాప్టర్ 2 'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాధవన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తోపాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తు బిజీగా ఉన్నాడు.
రీసెంట్ గా మాధవన్ ఇనిస్టాగ్రమ్ లో వాయిస్ నోట్ లో మాట్లాడుతు షూటింగ్ కోసం 'లడఖ్'(Ladakh)వచ్చి చిక్కుకుపోయాను. ఈ ఏరియాకి వచ్చిన దగ్గర్నుంచి విపరీతంగా మంచు కురుస్తుంది. పైగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయం మూసివేశారు. నేను 'లడఖ్,' వచ్చిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. పదిహేడేళ్ల క్రితం 'త్రీ ఇడియట్స్' షూటింగ్ కోసం 'లడక్' వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ రోజైనా వర్షం తగ్గి రాకపోకలు సాగాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
భారతదేశంలోని హిమాలయశిఖరాల మధ్య సముద్ర మట్టానికి మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతమే లడఖ్. లేహ్(Leh)ప్రధాన రాజధాని. బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున 'చిన్న టిబెట్" అని కూడా అంటారు. సంవత్సరానికి ఆరు నెలలు హిమపాతం కప్పబడి ఉంటుంది. అలాంటి ఈ ప్రాంతంలో కంటిన్యూగా వర్షాలు పడితే రవాణా సధుపాయం పూర్తిగా స్థంభించుకుపోతుంది. సుదీర్ఘ కాలం నుంచి పలు భాషలకి చెందిన చాలా చిత్రాలు 'లడక్' లో షూటింగ్ జరుపుకుంటూనే ఉన్నాయి.