English | Telugu
పూరీ ఇంట్లో దొంగలు
Updated : Mar 14, 2015
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన దొంగలు పూరీ జగన్నాధ్ ఇంట్లో జొరబడి అందినకాడికి దోచుకొని వెళ్ళిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో ఉన్న ఆయన ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు ప్రవేశించి బెడ్ రూమ్ లో ఉన్న బీరువాలో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన వజ్రాలు పొదిగిన ఒక నెక్లెస్ ఎత్తుకుపోయారు. ఈ విషయం తెలుసుకొన్న పూరీ జగన్నాథ్ అదే రోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.