English | Telugu

నాని  సినిమాల గురించి ఆలోచిస్తే.. పవన్ కళ్యాణ్ మాత్రం 


నాని(nani)గ్యాంగ్ లీడర్ తో తెలుగు సీమలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే అభిమానులని సంపాదించిన ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్. సంపాదించడమే కాదు తన సినిమా కోసం వెయిట్ చేసే పరిస్థితిని కూడా తీసుకొచ్చిందంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్ అనే పేరుని కూడా సంపాదించింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అండ్ నాచురల్ స్టార్ నాని గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ప్రియాంక మోహన్(priyanka mohan)పవన్ ఓజి లో చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న నాని సరిపోదా శనివారం(saripoda sanivaram)లో కూడా తనే హీరోయిన్. దీంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక మీట్ లో ప్రియాంక మాట్లాడుతు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం.పవన్ ,నాని లు ఇద్దరు క్రియేటివ్ గా ఉంటారు. పవన్ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంటారు. నాని ఎప్పుడు సినిమా గురించి కలలు కంటూ ఉంటారు. అదే విధంగా ఓజి లాంటి కథలో భాగస్వామ్యం కావడం కూడా చాలా లక్కీ. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి కూడా నా ధన్యవాదాలు అని కూడా తెలిపింది.

ఇక ఇదే మీటింగ్ లో నాని కూడా పవన్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్లడం కోసమే సినిమాల్లోకి వచ్చారేమో అనిపిస్తుందని చెప్పాడు. ఇప్పడు ఈ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి, ఇక ఈ ఇద్దరి మాటలతో పవన్ అభిమానులైతే మరో మాట లేకుండా ఓజి(og)టీజర్ ని మరో సారి చూస్తున్నారు.ఆఫ్టర్ పాలిటిక్స్ పవన్ నుంచి వచ్చే ఫస్ట్ మూవీ ఓజి అనే టాక్ కూడా ఉంది. ప్రభాస్ తో సాహో తీసిన సుజీత్ దర్శకుడు కాగా ఆర్ ఆర్ ఆర్ దానయ్య నిర్మాత.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.