English | Telugu
ఆమెకు సన్నీ లియోన్ చేసింది నచ్చిందట
Updated : Feb 25, 2016
సన్నీ లియోన్ నో స్మోకింగ్ అంటూ ఒక ఫన్నీ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ఒక తారకు తెగ నచ్చేసిందట. సన్నీ చేసిన ఈ ప్రయోగాన్ని ఆమె తెగ మెచ్చుకుంటోంది. ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిన ప్రియాంక చోప్రా. పొగ తాగద్దు అన్న సందేశాన్ని చాలా సరదాగా, ఆకట్టుకునే విధంగా చెప్పారంటూ సన్నీపై ప్రశంసలు కురిపించింది. ఇలాంటి మెసేజ్ లు యూత్ లోకి చాలా ఫాస్ట్ గా వెళ్తాయని, ఆ యాడ్ వెనక ఉన్న సదుద్దేశం అందరికీ చేరుతుందంటోంది ప్రియాంక. నో స్మోకింగ్ పేరుతో రిలీజైన సన్నీ లియోన్ యాడ్ రెండు రోజుల్లోనే 9 లక్షల వ్యూస్ కు సమీపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం.