English | Telugu

నాకు లవర్ లేడా..ఎవరన్నారు..?

ఈ మధ్య ప్రియాంక చోప్రా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. బాజీరావ్ మస్తానీ తో భారీ హిట్ కొట్టి, హాలీవుడ్ లో క్వాంటికో టీవీ సీరీస్, బే వాచ్ సినిమాలతో కెరీర్ లోనే సూపర్ ఫామ్ లోనే ఉంది. అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉండే ప్రియాంక, తన ప్రేమ విషయంలో మాత్రం ఎప్పుడూ దొరకలేదు. గతంలో షాహిద్ కపూర్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని వార్తలు వచ్చినా, ఎక్కడా నోరు విప్పలేదు. లేటెస్ట్ గా మాత్రం ఒక ప్రెస్ మీట్లో, ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చింది ప్రియాంక. " నాకు వ్యక్తిగత జీవితముంది. పబ్లిగ్గా దాని గురించి చెప్పడం నాకిష్టం ఉండదు. నా బంధాల్ని సీక్రెట్ గా ఉంచడమే నాకిష్టం. నాకు లవర్ లేడని ఎవరన్నారు..ఏమో! నేను ఇప్పటికే డేటింగ్ లో ఉన్నానేమో..షూటింగ్స్ లో తిరుగుతూ బిజీగా ఉన్నా కాబట్టి, తను నాతో ఉండటానికి కుదరట్లేదేమో " అంటూ హింట్ ఇచ్చింది ప్రియాంక. దీంతో ఇప్పుడు ప్రియాంక లవర్ ఎవరు అంటూ బాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. ఆ వ్యక్తి ఎవరన్నది త్వరలో ప్రియాంక చెబుతుందేమో చూడాలి మరి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.