English | Telugu

బాపు బొమ్మకి బంపర్ ఆఫర్

బాపు బొమ్మకి బంపర్ ఆఫర్ దక్కింది. పవన్ 'అత్తారింటికి దారేది'తో తన కెరీర్ మరో మలుపు తిరుగుతుందని భావించిన నిరాశే ఎదురయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన 'రభస' ప్లాఫ్ బాట పట్టడంతో అవకాశాలు లేక డీలా పడిపోయింది. ఈ సమయంలో ఈ బాపు బొమ్మకు వూహించని ఆఫర్ దక్కింది. ఏకంగా తమిళ సూపర్ స్టార్ సూర్య నటించే అవకాశం దక్కించుకుంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మాస్'. ఈ సినిమాలో అమీ జాక్సన్ ఒక హీరోయిన్ గా చేస్తోంది. అయితే సడన్ గా ఈ అమ్మడు సూర్య సినిమా నుంచి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో ప్రణీతను ఎంపిక చేసారు. మరీ ఈ సినిమాతోనైన ప్రణీత కేరియార్ జోరందుకుంటుందేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.