English | Telugu

అనుష్క, త్రిష‌... పెళ్లికి రెడీ!

మ‌న‌ క‌థానాయిక‌ల‌కు పెళ్లి మూడ్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే కొత్త ఇన్నింగ్స్ మొద‌లెట్టేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇది వ‌ర‌కు పెళ్లి మాటెత్తితే... `అప్పుడేనా, అందుకు చాలా టైమ్ ఉంది` అని స‌మాధానం దాటేసే క‌థానాయిక‌లు `ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మేమే చెప్తాం..` అని తెలివిగా జ‌వాబు ఇస్తున్నారు. కొంద‌రైతే ''తొంద‌ర్లోనే ఆ శుభ‌వార్త చెబుతాం'' అని ఊరిస్తున్నారు. అనుష్క‌, త్రిష‌ల దృష్టి కూడా పెళ్లిపై మ‌ళ్లింద‌ని ఏ స‌మ‌యంలో అయినా వారిద్ద‌రి నుంచి పెళ్లి శుభ‌వార్త వినే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ స‌మాచారం. ఈమ‌ధ్య అనుష్క పెళ్లికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మై కామెంట్లు చేసింది. త‌న‌కి 33 యేళ్ల‌ని, పెళ్లికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ఇంట్లోవాళ్లు భావిస్తున్నార‌ని.. స‌రైన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లోవాళ్లే ఈ సంగ‌తి చెప్తార‌ని షాకింగ్ కామెంట్ చేసింది. పెళ్ల‌యినా సినిమాల‌కు దూరమ‌వ్వాల‌ని లేద‌ని, చాలామంది క‌థానాయిక‌లు పెళ్ల‌యినా ఇన్నింగ్స్‌ని కొన‌సాగించార‌ని, త‌న విష‌యంలోనూ అదే జ‌ర‌గొచ్చ‌ని అనుష్క చెబుతోంది. అంటే పెళ్లి చేసుకొని కూడా వెండి తెర‌ని ఏలాల‌ని ప్లాన్ చేస్తోందేమో..?? మ‌రో వైపు త్రిషకీ పెళ్లి ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. ఇటీవ‌ల త్రిష నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌ని. పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణ‌యించార‌నే గాసిప్పు షికారు చేసింది. ఈ విష‌యంలో త్రిష క్లారిటీ ఇచ్చినా.. ఈ వార్త చ‌ల్ల‌బ‌డ‌లేదు. ఇప్పుడు త్రిష మాట మార్చింది. నిశ్చితార్థం ఏమీ జ‌ర‌గ‌లేదుగానీ, ఇంట్లోవాళ్లు పెళ్లి గురించి తొంద‌ర చేస్తున్నార‌ని, కొన్ని సంబంధాలు కూడా వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లోనే ఆ సంగ‌తులు చెప్తాన‌ని.. మాట ఇచ్చింది. మొత్తానికి ఈ స్టార్ క‌థానాయిక‌ల ఇంట్లో పెళ్లి బాజా మోగ‌బోతోంద‌న్న‌మాట‌. వ‌రుడు ఎవ‌రనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.