English | Telugu

ప్రకాష్‌రాజ్‌ కు తప్పిన ప్రమాదం

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రకాష్ రాజ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో పాల్గొని తిరిగి వస్తుండగా మాదాపూర్‌లో ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆయన కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ప్రకాష్‌రాజ్‌ చిన్న గాయలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, ''ఆర్టీసీ బస్సు నా కారుతోపాటు ఒక ఆటోని కూడా ఢీకొంది. అక్కడ గుమికూడిన కొంతమంది యువకులు ఆటోలో వున్నవారిని కాపాడే విషయాన్ని పక్కన పెట్టేసి, సెల్ ఫోన్‌లతో నన్ను ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. నా ప్రాణాల మీద భయం కంటే మనుషుల ప్రవర్తన పట్ల భయమేసిందని, మనం ఎక్కడికి పోతున్నామంటూ నన్ను నేనే నిందించుకోవాల్సి పరిస్థితి వచ్చిందని'' అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.