English | Telugu

నాగచైతన్య 'ఒక లైలా కోసం' టీజర్ వీడియో

ప్రేమకథ చిత్రాలతో హిట్లు దక్కించుకుంటున్న నాగచైతన్య, తొలిసినిమా 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' లవ్ స్టొరీతో ఆకట్టుకున్న కొండా విజయకుమార్ కాంబినేషలో రాబోతున్న సినిమా 'ఒక లైలా కోసం'. ఈ సినిమా ఫస్ట్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే..ఇది కూడా 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' లాగే కామెడీ లవ్ స్టొరీ అని తెలుస్తోంది. ఈ టీజర్ లో నాగచైతన్య, పూజా హెగ్డే ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ సింగల్ లైన్ కామెడీ పంచ్ లతో అలరించారు. మరి నాగచైతన్య తన లైలా ప్రేమను పొందడానికి ఎలాంటి గేమ్స్ ఆడాడో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే!

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.