English | Telugu

లారెన్స్ "రెబెల్"లో ప్రభాస్, అనుష్క

బాలాజీ సినీ మీడియా పతాకంపై,ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.భగవాన్,జె.పుల్లారావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రెబెల్". ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తూండగా,అతని సరసన హీరోయిన్ గా అనుష్క నటిస్తూందని తెలిసింది.

గతంలో ప్రభాస్ హీరోగా నటించిన "బిల్లా" చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించింది. మళ్ళీ ఈ "రెబెల్" చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క నటిస్తూంది.ఈ చిత్రంలో యాక్షన్, కామెడీ, సెంటిమెంట్,రొమాన్స్ అన్నీ కలగలిపి ఉంటాయట.ఈ చిత్రానికి తమన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు.స్వామి ఈ చిత్రానికి చక్కని మాటలు వ్రాస్తున్నారు.ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మూడవ వారంలో ప్రారంభించి, చిత్రం పూర్తయ్యే వరకూ సింగిల్ స్కెడ్యూల్లో షూటింగ్ చేస్తామని ఈ చిత్రం యూనిట్ అంటోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం