English | Telugu

ప్ర‌భాస్ స్కెచ్ ఏమిటి?

ఎప్పుడూ లేనిది సెల్ఫ్ ప‌బ్లిసిటీకి దిగాడు ప్ర‌భాస్. న‌రేంద్ర‌మెడీని, రాజ్‌నాథ్ సింగ్‌ని క‌ల‌సి.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. బాలీవుడ్‌లో పేరున్న హీరోలు, ద‌ర్శ‌కులు, పొలిటిక‌ల్ సెల‌బ్రెటీస్ ఇలా అంద‌రినీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకొంటున్నాడు ప్ర‌భాస్‌. ప్రభాస్ అంత‌రంగం ఏదైనా - వీటి వెనుక ప్ర‌భాస్వేసుకొన్న భారీ స్కెచ్ ఉంద‌ని టాలీవుడ్ టాక్.

బాహుబ‌లి బాలీవుడ్‌లో అద్భుత‌మైన వ‌సూళ్లు సాధిస్తోంది. ఓ డ‌బ్బింగ్ సినిమా ఈ స్థాయిలో విజృంభించ‌డం, స‌ల్మాన్ ఖాన్ సినిమా భ‌జ‌రంగీ భాయిజాన్‌కి చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం అక్క‌డ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే ఈసినిమాకి సంబంధించిన క్రెడిట్ మాత్రం ప్ర‌భాస్ కి ద‌క్క‌లేదు. ఇది రాజ‌మౌళి సినిమా సినిమాగానో, రానా సినిమాగానో చ‌లామ‌ణీ అవుతోంది. ఇప్పటి వ‌ర‌కూ ప్ర‌భాస్‌ని అక్క‌డ ప‌ట్టించుకొన్న‌దే లేదు. బాహుబ‌లి టీమ్ కూడా బాహుబ‌లిని రానా సినిమాగానే ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. అందుకే త‌న ప‌బ్లిసిటీని తానే చేసుకోవాల‌ని ఫిక్స‌య్యాడు ప్ర‌భాస్‌.

అందుకే యుద్ద ప్ర‌తిప‌దిక‌పైన ఇలా ప్ర‌ముఖుల్ని అంద‌రినీ క‌ల‌సి.. త‌న ముద్ర వేయాల‌నుకొంటున్నాడు. ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుకి పొలిటిక‌ల్‌గా ఉన్న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి రాజ్‌నాథ్ సింగ్‌ని క‌లిసేశా ఏర్పాటు చేసుకొన్నాడు. రాజ్‌నాథ్ సింగ్ ద్వారా మోడీ అపాయింట్‌మెంట్ ద‌క్కించుకోగ‌లిగాడు. మోడీ కూడా ట్విట్ట‌ర్‌లో బాహుబ‌లి ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంతో అంత‌ర్జాతీయంగానూ ప్ర‌బాస్ పేరు.. ప‌రిచ‌య‌మైంది. దాంతో ప్ర‌భాస్ స్కెచ్ వ‌ర్క‌వుట్ అయ్యింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.