English | Telugu

హీరోయిన్ తో ప్ర‌భాస్ పెళ్లి??

టాలీవుడ్ కి ఇది షాకింగ్ న్యూసే. మోస్ట్ వాంటెడ్ బ్యాచిల‌ర్‌.. ప్ర‌భాస్ పెళ్లి కుదిరింద‌ని, త్వ‌ర‌లోనే ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడ‌న్న గుస‌గుస‌లు టాలీవుడ్ అంత‌టా వ్యాపించాయి. ప్ర‌భాస్ వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్నాడ‌న్న‌ది ఓ న్యూస్‌. బాహుబ‌లి 2 షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే, ప్ర‌భాస్ పెళ్లి చేసుకొంటాడ‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలే చెబుతున్నాయి.

అయితే.. అది ప్రేమ పెళ్లి కావొచ్చ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌భాస్ ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ఓ క‌థానాయిక‌తో కొన్నాళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నాడ‌ని, వాళ్లిద్ద‌రూ ఇంట్లోవాళ్ల‌ని ఒప్పించి, త్వ‌ర‌లోనే ఒక్క‌ట‌వ్వ‌బోతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల్ని మాత్రం ప్రభాస్ స‌న్నిహితులు ఖండించ‌డం లేదు. అలాగ‌ని `అవును` అని కూడా చెప్ప‌డం లేదు.

ప్ర‌భాస్ అయితే పెళ్లి మాట ఎత్త‌గానే.. సిగ్గుప‌డుతూ చిరున‌వ్వుల మాటున స‌మాధానాన్ని దాట వేస్తున్నాడు. మ‌రి ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు? ఎవ‌రితో?? అనేవాటికి స‌మాధానాలెవ‌రు చెబుతారో? మొత్తానికి 2016లో ప్ర‌భాస్ పెళ్ల‌న్న‌ది ఖాయ‌మైపోయింది. ఎవ‌రితో అన్న‌ది మాత్రం కాల‌మే చెప్పాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.