English | Telugu
చెన్నై ప్రజలకు 'బాహుబలి' సాయం
Updated : Dec 4, 2015
భారీ వర్షాలతో నీళ్ళతో నిండిపోయిన చెన్నై ప్రజల దుస్థితి చూసి తెలుగు ప్రజలు చలించిపోతున్నారు. కరెంట్ లేక తినకడానికి తిండిలేక, తాగడానికి నీళ్ళు లేని చెన్నై ప్రజలు ఆశ్రయంకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రకృతి ప్రతాపం చూపిన ప్రతీసారి తెలుగు ప్రజలు తామున్నామంటూ చేయూతనివ్వడం ఆనందకరం. అలాగే ప్రజలకు కష్టాలు వచ్చిన ప్రతీసారి టాలీవుడ్ సెలబ్రిటీలు చేయూతనివ్వడం ఎంతో కాలంగా చూస్తూనే వస్తున్నాం. ఈ సారి కూడా వరదలతో అతలాకుతలమైన తమిళనాడును తమవంతుగా ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ క్యూకడుతున్నారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తమిళనాడు ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీ 15లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు, అల్లు అర్జున్ పాతిక లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించగా..లేటెస్ట్ గా బాహుబలి స్టార్ హీరో ప్రభాస్ 15 లక్షలు చెన్నై బాధితుల సహాయార్ధం విరాళాన్ని ప్రకటించారు. ఇదే బాటలో మరికొందరు సెలబ్రిటీలు ముందుకు రాబోతున్నారు.