English | Telugu
కోన భవిష్యత్ తేల్చనున్న 'శంకరాభరణం'
Updated : Dec 4, 2015
టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లతో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ కి గత కొంతకాలంగా టైమ్ అంతగా కలిసి రావడం లేదు. అతను చేసిన సినిమాల్ని బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీకోడుతున్నాయి. అతను సృష్టిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు చిరాకు పెట్టిస్తున్నాయి. ఈ సంవత్సరం అతను చేసిన బాడా సినిమాలు బ్రూస్ లీ..అఖిల్ అలాగే అతను నిర్మించిన త్రిపుర గట్టి దెబ్బలు కొట్టాయి. దీంతో కోన అంతటి వాడికి కూడా బ్యాడ్ నేమ్ తప్పడం లేదు. ఈ సమయంలో అతను ప్రొడ్యూస్ చేసిన శంకరాభరణం సినిమా వస్తోంది.
నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమాపై కోన పిచ్చ కాన్ఫిడెన్స్ గా వున్నాడు. ఈ సినిమా మరోసారి ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతుందని గట్టిగా నమ్ముతున్నాడు. దీని తరువాత డిక్టేటర్ వుంది. ఇప్పుడు శంకరాభరణం రిజల్డ్ కొంతవరకు డిక్టేటర్ పై ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు..కోనవెంకట్ భవిష్యత్ లో చేయబోయే ప్రాజెక్టులను ప్రభావితం చేయబోతుంది. మరి కోనకు 'శంకరాభరణం' ఎలాంటి టర్నింగ్ ఇవ్వబోతుందో వేచి చూద్దాం!!