English | Telugu

ప్రభాస్ డార్లింగ్ తమిళంలో బాహుబలి...!

ఏ ముహూర్తాన ప్రభాస్ నాకు తెలీదు అని నిత్యా మీనన్ అందో కానీ, ఆ తర్వాత బాహుబలితో దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ ఫ్యామస్ అయిపోయాడు ప్రభాస్. ఈ బాహుబలి తెలియని వాళ్లు ఎవరూ లేరంటే ఆశ్చర్యం లేదేమో. తమిళ, మళయాళ మార్కెట్లలో కూడా ప్రభాస్ కు మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తెలుగు సినిమాలన్నీ బయటి భాషల్లోకి తర్జుమా అవుతున్నాయి. మిర్చి, మిస్టర్ పెర్ఫెక్ట్, రెబల్, ఛత్రపతి సినిమాలు ఇప్పటికే తమిళ్ లో డబ్ అయ్యాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ సినిమా చేరింది. ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కు, డార్లింగ్ మళ్లీ లైఫ్ ఇచ్చింది. 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాను తమిళంలో ప్రభాస్ బాహుబలి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. భద్రకాళీ ఫిలిమ్స్ సంస్థ డార్లింగ్ డబ్బింగ్ రైట్స్ ను మంచి ధరకు దక్కించుకుంది. సినిమాలో తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన కాజల్, ప్రభు లు కీలక పాత్రలు పోషించడం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించడం లాంటి కారణాల వల్ల తమిళంలో కూడా ఈ సినిమా బాగా ఆడుతుందని భావిస్తున్నాయి సినీ వర్గాలు. కాగా బాహుబలి 2 షూటింగ్ నుంచి సమ్మర్ బ్రేక్ తో రిలాక్స్ అవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ లో భారీ వార్ సీక్వెన్సెస్ కు మూవ్ అవుతారని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.