English | Telugu

మాస్ రాజా వర్సెస్ రొమాంటిక్ రాజా

అక్కినేని నాగచైతన్య బాక్స్ ఆఫీస్ వద్ద తొలిసారిగా పోటీకి సిద్దమవుతున్నాడు. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ రేసులో సింగల్ గా బరిలోకి దిగిన చైతన్య ఈసారి మరో హీరో సినిమాని 'ఢీ'కొట్టబోతున్నాడు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఒక లైలా కోసం సెప్టెంబర్ అయిదున విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ' గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమా చేసిన కొండా విజయకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా రిలీజైన ఈసినిమా టీజర్ ని చూస్తే ఈ సారి మళ్లీ యూత్ ఫుల్ రొమాంటిక్ స్టోరినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే అదే రోజున రవితేజ సినిమా 'పవర్' కూడా విడుదలవుతో౦ది. ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో మంచి క్రేజ్ వచ్చింది. పక్కా మాస్ మసాలా చిత్రంగా రూపొందిందని టాక్ తేవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దీంతో సెప్టెంబర్ అయిదున బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ రాజా వర్సెస్ రొమాంటిక్ రాజాకు పోటీ అన్నమాట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.