English | Telugu

రామ్ గోపాల్ వర్మ మూవీ 'కేసిఆర్'

ఎప్పటికప్పుడు ఏదో ఓక సంచలన వ్యాఖ్య చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడం రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత. లేటెస్ట్ గా కేసీఆర్ అన్న టైటిల్తో ఓ సినిమా తీస్తానని రివీల్ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. కేసీఆర్’పై వర్మ‘పొగడ్తల వర్షం కురిపించాడు. కేసీఆర్ ఈజ్ ఎ గుడ్ హిట్లర్ అని...ఎన్టీఆర్ అనే పదం కంటే కేసీఆర్ అనే పదం వినడానికి బాగుటుందని చెప్పుకొచ్చాడు. సమంత, తమన్నా, ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందంటున్నాడు. అధికారం, దర్పం ఆయనను అందగాడిని చేస్తున్నాయని అన్నాడు. ఏదేమైనా వర్మ కామెంట్స్ సినీ, రాజకకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.