English | Telugu

మహేశ్‌కు విలన్‌గా పవన్ కళ్యాణ్ ఫేవరేట్ డైరెక్టర్..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు పక్కన విలన్‌గా నటించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేవరేట్ డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆయన ఎవరో కాదు "ఖుషి "సినిమా తో పవన్ కళ్యాణ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన "ఎస్.జె.సూర్య ". సూర్య మల్టీ టాలెంటెడ్.. ఖుషి, వాలి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అఆ, ఇసై, కళ్వనిన్ కాదలి, తిరుమురుగన్, వ్యాపారి తదితర చిత్రాలలో హీరోగానూ నటించారు. హీరోగా ఛాన్స్ రాని పరిస్థితిలో నన్బన్, వైరాజావై, ఇరవి తదితర చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలలో నటించారు. ఆ తర్వాత దర్శకత్వమా? నటనా? అనే డైలమాలో ఉండగా ..ఏఆర్ మురుగదాస్ తమిళ్, తెలుగులో దర్శకత్వం వహించే చిత్రంలో మహేశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు మురుగదాస్, సూర్యను సంప్రదించారు. దీనికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. ఎస్‌.జే. సూర్య తెలుగులో మహేశ్‌తో నాని చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.