English | Telugu

పవన్ "పంజా" విసురుతాడా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సారా జేన్ దియాస్, హీరోయిన్ గా, ప్రముఖ తమిళ దర్శకులు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "పంజా". ఈ "పంజా" చిత్రం ఇటీవల సెన్సారు కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. "పంజా" చిత్రానికి సెన్సారు వారు "యు/ఎ" సర్టిఫికేట్ నివ్వటం విశేషం.

గతంలో వచ్చిన పవన్ చిత్రాలు "కొమరంపులి, తీన్ మార్" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పవన్ అభిమానులకు ఈ "పంజా" చిత్రం నవరసభరితంగా ఉండి విశేషంగా అలరించగలదని ఈ చిత్రం యూనిట్ అంటోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ "పంజా" చిత్రం ఆడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. "పంజా" చిత్రం డిసెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతూంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.