English | Telugu

రవితేజకి 'పవర్' వచ్చింది

రవితేజ కేరియార్ లో 'పవర్' మూవీ పవర్ ఫుల్ హిట్ గా నిలించింది. ఈ సినిమా మొత్తం రన్ లో 25కోట్ల వసూళ్ళు రాబట్టినట్లు తెలుస్తోంది. మాస్ రాజా కేరియార్ లోనే ఇది రెండో అతిపెద్ద హిట్. ఈ సినిమా స్టోరీ రోటీన్ అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన పెద్ద సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్టొరీ ఇంకా పకడ్బందీగా వుంటే రవితేజకి ఓ బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చి వుండేదని సినీ విమర్శకులు అంటున్నారు. ట్రేడ్ వర్గాల గణాంకాల ప్రకారం పవర్ ఫైనల్ కలెక్షన్స్ వివరాలిలా వున్నాయి.

నైజాం – రూ. 8.48 కోట్లు
సీడెడ్ – రూ. 3.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.05 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 1.44 కోట్లు
పశ్చిమ గోదావరి - రూ. 1.27 కోట్లు
కృష్ణా -రూ. 1.10 కోట్లు
గుంటూరు – రూ. 1.70 కోట్లు
నెల్లూరు – రూ. 76.00 లక్షలు

తెలంగాణ+ ఏపీ కలిపి రూ. 20.5 కోట్లు

కర్ణాటక – రూ. 2.46 కోట్లు
దేశంలోని మిగతా ప్రాంతాల్లో - రూ.68 లక్షలు
ఓవర్సీస్ -రూ.1.85 కోట్లు
మొత్తం వసూళ్లు రూ. 25.49 కోట్లు

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.