English | Telugu
మహేష్ బాబుకి కొత్త ఐటెంగర్ల్
Updated : Dec 27, 2014
'అవును’ సినిమాతో తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన పూర్ణ.. తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఇటీవలే అవును-2 పూర్తి చేసిన పూర్ణ ఈ సినిమా తర్వాతైనా మంచి ఛాన్స్‌లు వస్తాయేమో అని ఆశ పడుతోంది. ఐతే హీరోయిన్‌గా కాకపోయినా ఓ బంపర్ ఆఫర్ తగిలింది ఈ తమిళ అమ్మాయికి. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది ఆమెకు.
కొరటాల శివ డైరెక్షన్‌లో మహేష్ చేస్తున్న సినిమాలో పూర్ణ ఐటెం సాంగ్ చేయబోతోంది. ఇదో ప్రత్యేకమైన పాట అని.. క్లాసికల్ డ్యాన్స్ తెలిసిన హీరోయన్ కోసం చూస్తున్న కొరటాలకు పూర్ణ మంచి ఛాయస్‌లా కనిపించిందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని.. ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పుణెలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.