English | Telugu

కంప్లీట్ మూవీ రివ్యూ: ' పెన్సిల్‌ '

ప్రైవేటు కాలేజీల వ్య‌వ‌హారం పైన ప‌టారం.. లోన లొటారంగా త‌యారైంది. ర్యాంకుల మెరుపులు బ‌య‌ట‌కు క‌నిపిస్తున్నా.. లోలోప‌ల మాత్రం కుళ్లూ కుతంత్రాలే. త‌మ కాలేజీని నెంబ‌ర్ వ‌న్ గా తీర్చిదిద్దాల‌న్న ఆశ‌యంతో నైతిక విలువ‌ల‌కు కూడా తిలోదాలిస్తున్నారు. విద్యార్థులు కూడా అంతే! త‌ల్లిదండ్రులు డ‌బ్బులు పోసి డొనేష‌న్ల‌తో సీట్లు కొంటుంటే... కాలేజీ ఆయ‌తాయి ప‌నుల‌కూ, చిల్ల‌ర వ్య‌వ‌హారాల‌కూ వేదిక చేసుకొంటున్నారు. ఈ విష‌యాల చుట్టూ న‌డిచే క‌థ పెన్సిల్‌. మ‌రి ఈ పాయింట్‌ని ద‌ర్శ‌కుడు మ‌ణినాగ‌రాజ్ ఎంత స‌మ‌ర్థంగా తెర‌కెక్కించాడు? జీవీ ప్ర‌కాష్‌కుమార్‌, శ్రీ‌దివ్య ఎంత బాగా న‌టించారు? తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
అదో ఖ‌రీదైన కార్పొరేట్ క‌ళాశాల‌. రాష్ట్రంలోని సెల‌బ్రెటీల పిల్ల‌లంతా అక్క‌డే చ‌దువుతుంటారు. శివ (జీవీ ప్ర‌కాష్‌) మాయ (శ్రీ‌దివ్య‌), నితిన్ (షారిక్ హాస‌న్‌) ఇంట‌ర్ సెకండీయ‌ర్ స్టూడెంట్స్‌. శివ కాలేజీ టాప‌ర్‌. శాస్త్ర‌వేత్త కావాల‌నుకొంటాడు. మాయ అంటే చాలా ఇష్టం. నితిన్ ఓ పోకిరి. అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, వాళ్ల‌ని వాడుకొంటుంటాడు. ఓసారి మాయ గ‌ట్టిగా క్లాస్ పీకుతుంది. దాంతో మాయ‌పై కోపం పెంచుకొంటాడు. శివ‌కు పేరు రావ‌డం నితిన్‌కి ఇష్టం ఉండ‌దు. అందుకే.. శివ థీసెస్ పుస్త‌కాల్ని త‌గ‌ల‌బెట్టేస్తాడు. నితిన్ వ్య‌వ‌హారం కాలేజీలో చాలామందికి న‌చ్చదు. వాళ్లంతా నితిన్‌పై ప‌గ పెంచుకొంటారు. ఓరోజు హ‌ఠాత్తుగా నితిన్ శ‌వ‌మై క‌నిపిస్తాడు. మెడ‌పై పెన్సిల్‌తో పోట్టు పొడిచి ఎవ‌రో నితిన్‌ని దారుణంగా హ‌త్య చేస్తారు. ఆ కిల్ల‌ర్ ఎవ‌రో తెలుసుకోవ‌డానికి హీరో హీరోయిన్లు చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా.

అనాలసిస్:
ప్ర‌యివేటు కాలేజీ వ్య‌వ‌హారాల చుట్టూ న‌డిచే క‌థ ఇది. పేరు కోసం వాళ్లెంత దురాగ‌తాలు చేస్తున్నారో ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌థ‌కు త‌గ్గ‌ట్టు సినిమా మొత్తం కాలేజీ క్యాంప‌స్‌లోనే సాగింది. పాట‌ల్లో త‌ప్ప‌.. మ‌రో లొకేష‌న్ క‌నిపించ‌దు. స్థూలంగా ఇదో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ. కాలేజీలో ఓ హ‌త్య జ‌రుగుతుంది. ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసుకోవ‌డ‌మే టాస్క్‌. ప్రేమ‌క‌థ ఉన్నా... దానికంత ప్రాధాన్యం లేదు. కామెడీ జోలికి వెళ్ల‌లేదు. సినిమా అంతా సీరియ‌స్ మూడ్‌లోనే సాగుతుంది. శివ‌, నితిన్‌, దివ్య‌ల మ‌ధ్య న‌డిచే స‌న్నివేశాలే ఈ చిత్రానికి కీల‌కం. కాలేజీలో లెక్చ‌ల‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు, కాలేజీ వ్య‌వ‌హారాల్ని బ‌యట‌కు రాకుండా ఎలా తొక్కేస్తున్నారు? అన్న విష‌యాల్ని తెర‌పై కాస్త చూపించారు. తొలి అర్థ‌భాగంలో ఓ హ‌త్య జ‌రుగుతుంది. సెకండాఫ్‌లో ఇన్విస్టిగేష‌న్ న‌డిపించి.. క్లైమాక్స్‌లో దోషి ఎవ‌రో చూపించారు. కాలేజీలకు మీ పిల్ల‌ల్ని పంపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఆలోచించుకోండి.. అంటూ ఓ లెక్చ‌ర్ ఇచ్చి శుభం కార్డు వేశారు.

తొలిభాగం సాదాసీదాగా సాగుతుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. అయితే దాన్ని ఛేదించ‌డానికి హీరో, హీరోయిన్లు వేసే ప్లానులు తేలిపోతాయి. లాజిక్‌కి అంద‌వు. ఓ హ‌త్య జ‌రిగితే.. అక్క‌డే బ్లాక్ బోర్డుపై ఎవరు చేసి ఉండొచ్చు అంటూ స్కెచ్చులు వేసుకొంటూ ఇన్వెస్టిగేష‌న్ మొద‌లెట్ట‌డం మ‌రీ టూమ‌చ్‌. హ‌త్య జ‌రిగింద‌న్న భ‌యం, ఆందోళ‌న అక్క‌డున్న మిగిలిన పాత్ర‌ల్లో క‌నిపించ‌దు. దాంతో సీరియ‌స్ మేట‌ర్ కాస్త సిల్లీగా మారిపోయింది. కాలేజీలో ఇన్‌స్పెష‌న్ ఎపిసోడ్ మ‌రీ విసుగెత్తిస్తుంది. పాట‌లు కూడా క‌థాగ‌మ‌నానికి అడ్డు త‌గిలేవే. హ‌త్య ఎవ‌రు చేశార‌న్న సంగ‌తి క్లైమాక్స్‌లో తేలినా.. ఆ ముడి విప్పిన విధానం కూడా ఆస‌క్తిగా లేదు.

పెర్ఫామెన్స్:
న‌టీన‌టుల విష‌యానికొస్తే... అంద‌రూ పాత్రోచితంగా న‌టించారు. జీవీ ప్ర‌కాష్‌కుమార్‌కి స‌రిప‌డే పాత్ర ఇది. కాలేజీ కుర్రాడిగా ఇమిడిపోయాడు. శ్రీ‌దివ్య న‌ట‌న మ‌రోసారి ఆక‌ట్టుకొంటుంది. విల‌న్‌గా క‌నిపించిన కుర్రాడికే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. తెలుగు న‌టీన‌టులెవ‌రూ క‌నిపించ‌రు. దాంతో ఏ క్యారెక్ట‌ర్నీ ఓన్ చేసుకోలేం.

టెక్నికల్ గా:
సాంకేతికంగా సినిమా బాగుంది. జీవీ సంగీతం ఆక‌ట్టుకొంటుంది. రెండే పెద‌వులు.. ఎంత భాషో పాట మంచి మెలోడీ. మాస్ బీటున్న పాట‌ని చివ‌ర్లో టైటిల్ కార్డ్స్‌లో వేశారు. కెమెరా వ‌ర్క్ కూడా ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. సెకండాప్‌లో చూసిన సీనే మ‌ళ్లీ చూస్తున్న ఫీలింగ్ క‌లిగింది. మంచి పాయింట్‌ని ప‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు దాన్ని ఎంట‌ర్‌టైనింగ్ గా చెప్ప‌లేక‌పోయాడు.

తెలుగువన్ వ్యూ:
మొత్తానికి పెన్సిల్ సినిమా స‌గం మార్కుల‌తో పాసైన ఓ స్టూడెంట్‌లా క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడి బుర్ర‌కు, పెన్సిల్‌కీ ఇంకాస్త ప‌దును పెడితే.. బెట‌ర్ అవుట్ పుట్ వ‌చ్చేది.

రేటింగ్‌ : 2.25/5

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.