English | Telugu
ఆమె చేసిన పనికి అంతమంది బుక్కైపోయారు..!
Updated : May 13, 2016
బాలీవుడ్ యాక్ట్రెస్ నర్గీస్ ఫక్రి, నిర్మాత ఉదయ్ చోప్రాలు డేటింగ్ లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇద్దరికీ మధ్య కెమిస్ట్రీ నడుస్తున్నా, ఎప్పుడూ పబ్లిగ్గా ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుందామని ఉదయ్ అడిగినా వరస సినిమాలుండటంతో నర్గీస్ ఒప్పుకోలేదట. సడెన్ గా ఏమైందో ఏమో, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని నర్గీస్ అడిగితే ఉదయ్ వద్దన్నాడట. దీంతో, ఇద్దరికీ గొడవ పెద్దదై, నర్గీస్ ఫ్లైట్ బుక్ చేసుకుని అమెరికా వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఆమె నటించిన అజహర్, హౌస్ ఫుల్ 3 ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో, నిర్మాతలు నెత్తి మీద టవల్ వేసుకున్నారట. మరో వైపు నర్గీస్ మేనేజర్ మాత్రం ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదని నిర్మాతలకు చెప్పే ఫారిన్ కు వెళ్లిందని, నెల రోజుల రెస్ట్ తర్వాత తిరిగొస్తుందని చెబుతున్నాడు. అతను చెప్పిన దాని కంటే, ముందు వచ్చిన రూమర్ కే బాలీవుడ్ జనాలు ఎక్కు ప్రాధాన్యతనిస్తున్నారు. మేనేజర్ ఎంత చెబుతున్నా, ఉదయ్ తో గొడవ వల్లే ఆమె న్యూయార్క్ వెళ్లిందని బాలీవుడ్ ఫిక్సైపోయింది.