English | Telugu

పవన్ "ది షాడో" మార్చి నుండి

ఆర్కా మీడియా, సంఘమిత్ర ఆర్ట్స్ పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సరా ఖాన్ హీరోయిన్ గా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్థన్ కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం నిర్వహిస్తూండగా,శోభు యార్లగడ్డ, నీలిమ తిరుమల శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"ది షాడో".ఈ చిత్రం కలకత్తాలో వచ్చే నెల అంటే మార్చ్ లో ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఎడిటింగ్ ని శ్రీకర్ ప్రసాద్,సినిమాటోగ్రఫీని పి.యస్.వినోద్,ఆర్ట్ ని సునీల్ బాబు,యాక్షన్ ని శ్యామ్ కౌషల అందిస్తారు.ఒకప్పుడు ప్రముఖ డిటెక్టీవ్ నవలల రచయిత మధుబాబు వ్రాసిన "షాడో" నవలలు ఆంధ్రప్రదేశ్ లోని పాఠకులను ఒక ఊపు ఊపాయి.మరి ఈ చిత్రాన్ని ఆ కథతో తీస్తున్నారో లేక ఇది వేరే కథతో తీస్తున్నారో తెలుసుకోవాలంటే మరి కొంతకాలం ఆగాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం