English | Telugu

పవన్ సినిమాలు మానొద్దని సలహా ఇచ్చిన చిరంజీవి

పవన్ సినిమాలు మానకూడదని సూచించారు చిరంజీవి. స్పీచ్ ఆయన మాటల్లోనే :

" నాకు ఈ మధ్య ఒక వార్త తెలిసింది. రెండు మూడు సినిమాల తర్వాత ఆలోచిస్తాను అంటున్నాడు. మీరే చెప్పండి..ఇది కరెక్టా..?(ఆడియన్స్ ను ఉద్దేశించి). సినిమాలు చేయను అంటున్నాడు. సినిమాల్లో పవన్ ఈ స్థాయి కి రావడానికి నా మాట దోహదపడింది. అందుకే మరో సలహా ఇస్తున్నాను. ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తావు. అంతమాత్రాన ఈ రంగాన్ని దూరం చేసుకోవద్దు. నీ కెపాసిటీ నీకు తెలియకు పోవచ్చు గానీ అందరికీ తెలుసు. నువ్వు జోడు గుర్రాల మీద స్వారీ చేయగలవు. రెండు రంగాల్లోనూ నువ్వు రాణించగలవు.. ఇలాంటి అభిమానం లభించడం ఎన్నో జన్మల ఫుణ్యఫలం. ఇంత మంది అభిమానిస్తున్నారు. వీళ్ల మనసును నొప్పించద్దు. సినిమాలు మానద్దు. నీతో పాటు మేమంతా ఉంటాం. (ఫ్యాన్స్ వైపు తిరిగి) నా మాట కాదంటాడని నేను అనుకోవట్లేదు. పవన్ సినిమా కనీవినీ విధంగా రికార్డ్స్ బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ ను మన ఇండస్ట్రీలో మరొకరు బ్రేక్ చేయాలి. అలాంటి ఆరోగ్యకరమైన పోటీ అందరి మధ్య ఉండాలి. అప్పుడే పరిశ్రమ మరింత ఎత్తుకు వెళ్తుంది. రికార్డ్స్ ఎవరివైనా ఇండస్ట్రీకే పేరు తీసుకురావాలి. ఒకరిని మించి మరొకరి సినిమాలు ఆడాలి. అందరూ ఆరోగ్యకర వాతావరణంలో ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను "

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.