English | Telugu
గడ్డం పెంచుకోవడం పాలిటిక్స్ లో ఉన్న ప్లస్..!
Updated : Mar 12, 2016
అభిమానులకు మింగుడు పడనిదైనా ఇది సాక్షాత్తూ పవనే చెప్పిన మాట. కేవలం మరో రెండు లేదా మూడు సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేస్తానని, 2019 నుంచి పూర్తి స్థాయి పాలిటిక్స్ ఉంటానని పవన్ స్పష్టం చేసేశారు. ఇంతకీ పవన్ పాలిటిక్స్ ను ప్రిఫర్ చేయడానికి కారణమేంటో తెలుసా..సినిమాల్లోని మేకప్, కలర్స్ వేసుకోవడం లాంటి కృత్రిమమైన పనులతో ఇప్పటికే చాలా అలిసిపోయారట పవన్.
నిజానికి నేచురల్ గా, రఫ్ గా ఉండటం పవన్ కు ఇష్టం. కానీ సినిమా కోసం నీట్ గా షేవ్ చేసుకోవడం, రంగు వేసుకోవడం లాంటివి ఆయనకు ఇబ్బంది గానే ఉందట. పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత హాయిగా గడ్డం పెంచుకోవచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు పవన్. రెండు పడవలపై కాళ్లు వేసి ప్రయాణించడం కంటే, పూర్తిగా ప్రజల కోసం పోరాడటంపై దృష్టి పెట్టడమే పవన్ ఉద్దేశమట. కానీ డబ్బు అవసరం కాబట్టి, నటించకపోయినా, సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్.