English | Telugu
పవన్ యాడ్స్ లో ఎందుకు చేయట్లేదో తెలుసా..?
Updated : Mar 12, 2016
పవన్ తన ఖుషీ, జానీ సినిమాల టైంలో ఒక కూల్ డ్రింక్ యాడ్ లో నటించారు. అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో రైవల్ కూల్ డ్రింక్ కంపెనీలు పోటా పోటీగా యాడ్ కాంపెయిన్లు చేసేవి. ఆ తర్వాత పవన్ ఇంకెప్పుడూ యాడ్స్ లో కనిపించలేదు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో పవన్ కున్న క్రేజ్ వేరే ఏ హీరోకు లేదన్నది సుస్పష్టం. కానీ మరి పవన్ ఏ యాడ్స్ లోనూ ఎందుకు కనిపించట్లేదు..?
అనుపమా చోప్రా ఇదే క్వశ్చన్ ను పవన్ ముందుంచితే, తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పేశారు పవన్. నేను వాడని వస్తువును, వాడుతున్నాను అని అబద్ధం చెప్పడానికి, మీరు కూడా వాడండి అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించడానికి నాకెందుకో మనసొప్పలేదు. అందుకే యాడ్స్ వదిలేసుకున్నాను. నిజానికి యాడ్స్ తో మనీ బాగా వస్తుందని, కానీ తన మనసు ఒప్పుకోని కారణంగానే వదిలేశానని చెప్పాడు పవర్ స్టార్. అయితే ఆల్రెడీ మీరు వాడుతున్న బ్రాండ్ కే యాడ్స్ చేస్తే ఈ సమస్య సాల్వ్ అయిపోతుందంటూ అనుపమా ఇచ్చిన సజెషన్ కు అదే ఆలోచిస్తున్నానంటూ స్మైల్ ఇచ్చేశాడు పవన్.