English | Telugu

తండ్రితో అకీరానందన్

తండ్రితో అకీరానందన్ కాశీ తదితర ప్రాంతాలకు వెళ్ళాడు. "తీన్ మార్" సినిమా షూటింగ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కొడుకు అకీరానందన్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అప్పటి ఫొటోలు మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. నిజానికి ప్రముఖ హాలీవుడ్ దర్శకులు అకీరా పేరునే పవన్ కళ్యాణ్ తన కొడుక్కి కూడా పెట్టుకున్నాడు. అకీరానందన్ కు కూడా నటనంటే చాలా ఇష్టమని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. మరి అకీరానందన్ కూడా తన తండ్రిలాగా భవిష్యత్తులో పవర్ స్టార్ గా ఎదుగుతాడా లేదా అన్నది కాలమే చెప్పాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.