English | Telugu

వారణాసిలో రామ్ చరణ్

వారణాసిలో రామ్ చరణ్ తేజ ఉన్నాడు. అక్కడికి తన తల్లి సురేఖతో కలసి వెళ్ళాడు. రామ్ చరణ్ వారణాశికి రెండు కారణాలతో వెళ్ళాడు. ఒకటి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పెట్టబోతున్న శాటిలైట్ ఛానల్ బాగా పాప్యులరవ్వాలనీ, ఎందుకంటే ఆ ఛానల్ కి రామ్ చరణే కాబోయే సి.ఇ.వో.కనుక, మరొక కారణామేమిటంటే తాను త్వరలో హీరోగా నటించబోతున్న "రచ్చ" చిత్రం మంచి హిట్టవ్వాలని కోరుకునేందుకు రామ్ చరణ్ వారణాశికి వెళ్ళాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన ట్విట్టర్ లో రామ్ చరణ్ పోస్ట్ చేశాడు.

" హాయ్ ఫ్రెండ్స్...నేను మా అమ్మగారితో కలసి వారణాసికి వెళుతున్నాను. వారణాసి చాలా శక్తివంతమైన, పుణ్యక్షేత్రమని వారణాసి గురించి చాలా కథలు విన్నాను. కానీ ఇంతవరకూ వారణాసిని చూడలేదు. స్వయంగా చూసి వారణాసి గురించి తెలుసుకోవాలని వారణాసికి వెళుతున్నాను. వారణాసిలో మీ గురించి కూడా కాశీ విశ్వనాథుణ్ణి ప్రార్థిస్తాను" అని రామ్ చరణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రామ్ చరణ్ ప్రస్తుతం మెగాసూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో తమన్నా భాటియా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో,యన్.వి.ప్రసా, పరాస్ జైన్ నిర్మిస్తున్న "రచ్చ" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ రెండవ వారంలో ఈ చిత్రం ప్రారంభం కాబోతూంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.