English | Telugu
పవన్ డిస్కౌంట్ ఇచ్చాడు.. బాకీ తీరిపోయింది
Updated : Jan 25, 2016
నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు.. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కి గట్టి షాక్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. అత్తారింటికి దారేది సమయంలో తనకు బాకీ ఉన్న రెండు కోట్ల రూపాయల లెక్క తేల్చాలని, ఆ తరవాతే.. సినిమాని విడుదల చేసుకోవాలని హుకుం జారీ చేశాడు. అప్పటికప్పుడు పవన్‌ని బుజ్జగించి తన సినిమాని విడుదల చేయించుకొన్నాడు ఆ నిర్మాత. ఇప్పుడు నాన్నకు ప్రేమతో కాస్త నిలబడగలిగింది.
ప్రసాద్ కూడా.. పవన్‌కి తాను ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చేశాడట. అయితే ముందుగా అనుకొన్నట్టు రెండు కోట్లు కాదు. కోటిన్నరే. పవనే నిర్మాత పరిస్థితి చూసి జాలి పడ్డాడని, అందుకే అరకోటి రిబేట్ ఇచ్చాడని, బీవీఎస్ ఎన్ ప్రసాద్ సింగిల్ పేమెంట్‌తో తన బాకీ తీర్చేసుకొన్నాడని టాక్. సో.. ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణిగినట్టే. త్రివిక్రమ్‌కీ సదరు నిర్మాత కొంత ఎమౌంట్ బాకీ పడ్డాడు. దానికీ ఇలాంటి డిస్కౌంట్ ఆఫరేదో ఇస్తే.. ఓ పనైపోతుంది కదా.