English | Telugu
పవన్.. ఓ పబ్లిసిటీ మాస్టర్
Updated : Nov 13, 2015
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ మళ్లీ గొంతెత్తాడు. సగం అర్థమైనట్టు.. సగం కానట్టు - చేస్తానన్నట్టు, ఏదీ చేయనన్నట్టు - ఎప్పట్లా... సగం సగం మాట్లాడాడు. అలవాటు ప్రకారం చివర్లో తుస్సుమనిపించాడు. కనీసం సినిమాల్లో డైలాగ్ చెప్పినట్టు.. ఒక్క పంచూ వదల్లేదు. కానీ.. పంచేసుకొని మాత్రం వచ్చాడు. ఇదంతా పవన్ ఎందుకు చేస్తున్నట్టు?? రాజధాని శంకుస్థాపన రోజున లేని ఖాళీ... ఇప్పుడెందుకు దొరికినట్టు? అప్పుడూ ఇలానే కాసేపటి కోసం ప్రత్యేక విమానంలో రావొచ్చుకదా? ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు.. ఇలా ప్రతి ఒక్కరిలో లక్ష డౌట్లు.. దీపావళి ఔట్లలా పేలుతున్నాయి.
పవన్ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి. వాళ్ల మాట కరెక్టే అనిపిస్తోంది. రాజధాని శంకుస్థాపనకు వస్తే.. పవన్ ఓ గుంపులో గోవిందయ్య. అక్కడకొచ్చిన సవాలక్ష అతిథుల మధ్య ఒక్కడు. మోదీ నామ జపంలో పవన్ ఎక్కడో ఉంటాడు. మీడియాకీ పవన్‌పై దృష్టి పెట్టేంత టైమ్ ఉండదు. అందుకే.. పవన్ ఇప్పుడు సింగిల్‌గా వచ్చాడు. పవన్ కోసం మీడియా ఎగబడేలా చేసుకొన్నాడు. ముఖ్యమంత్రి కూడా మూడు గంటలు కేటాయించేలా ప్లాన్ వేశాడు.
ఈ మూడు గంటల్లో వవన్ మాట్లాడిందీ, వాగ్గాదాలు తీసుకొచి వచ్చిందీ ఏమీ లేదు. బయటకు వచ్చి తేల్చిందీ లేదు. దీన్ని బట్టి.. పవన్ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చా..?? పైగా చిరంజీవి దగ్గరకు వెళ్లినప్పుడు గబ్బర్ సింగ్ ఖాకీ గెటప్, ఇప్పుడు పంచె కట్టు.. చూస్తుంటే గబ్బర్ సింగ్‌లోని సీన్లను ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్న పెరేడ్‌లా ఉందిది. మరి ఈ కామెంట్లకు పవన్ ఫ్యాన్స్.. ఏమంటారో..?