English | Telugu

పిఠాపురం లో అపోలో హాస్పిటల్.. స్థలం కొన్న రామ్ చరణ్, ఉపాసన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఏం చెయ్యబోతున్నాడో బయట ప్రపంచానికి తెలిసే ముందే అభిమానులకి తెలిసిపోతుంది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు అభిమానులు పవన్ ని ఎంతగా ఫాలో అవుతారో. తాజాగా ఇంకో పవర్ ఫుల్ న్యూస్ బయటకి వచ్చింది. దాంతో పవన్ ని గెలిపించుకుంటే ఇలా ఉంటుందా అనే చర్చ ఇండియా వ్యాప్తంగా మొదలయ్యింది.

పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన ఎన్నికల్లో పిఠాపురం(pitapuram)అసెంబ్లీ నుంచి గెలుపొంది ఏకంగా డిప్యూటీ సిఎం అయిన విషయం అందరికి తెలిసిందే. అదే విధంగా ఇచ్చిన హామీ లని ఒక్కొక్కటిగా నెరవేర్చేటందుకు ప్రణాళికల్ని కూడా రెడీ చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు మాట్లాడుతు పవన్ కళ్యాణ్ ని పిఠాపురం వాసులు గెలిపించుకోవడంతో అక్కడి ప్రజల తల రాతలు మారిపోయాయి. ఇండియాలోనే అత్యాధునిక హాస్పిటల్ గా పేరెన్నిక గన్న అపోలో గ్రూప్ పిఠాపురంలో తమ నూతన బ్రాంచ్ ని స్థాపించబోతుంది.

ఈ మేరకు పది ఎకరాలు కొన్నారు. రామ్ చరణ్(ram charan)ఉపాసన (upasana)దగ్గరుండి ఆ ల్యాండ్ కొన్నారని కూడా చెప్పాడు. రాబోయే రోజుల్లో స్వర్గ లోకం అంటే ఎక్కడో ఉండదని పిఠాపురం లో ఉంటుందనే విషయాన్నీ అందరు నమ్ముతారని కూడా చెప్పాడు.ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా విశ్వంభర(vishwambhara) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా పిఠాపురం లో జరిపించే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.