English | Telugu

గందరగోళంలో ‘ఓజీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. మేకర్స్‌ క్లారిటీ ఇస్తారా?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పవర్‌ ప్యాక్డ్‌ మూవీ ‘ఓజీ’. ప్రేక్షకులు, పవర్‌స్టార్‌ అభిమానులు కోరుకునే పవర్‌ఫుల్‌ ఎలివేషన్స్‌తో థ్రిల్‌ చేసేందుకు ఈనెల 25న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్టింప్స్‌, పాటలు విపరీతంగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. సినిమాపై ఒక పాజిటివ్‌ బజ్‌ రన్‌ అవుతోంది. మునుపటి పవర్‌స్టార్‌ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్‌ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని మరింత పెంచేందుకు ఎంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనేది పక్కా ప్లానింగ్‌తో చెయ్యాల్సి ఉంటుంది. అయితే ‘ఓజీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి సంబంధించిన డేట్‌ విషయంలో గందరగోళం ఉన్నట్టు మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సెప్టెంబర్‌ 20న వైజాగ్‌లో జరుగుతుందని, యూనిట్‌ అంతా అక్కడికి తరలి వెళ్తున్నారని ఒక న్యూస్‌ వినిపిస్తోంది. మరో పక్క సెప్టెంబర్‌ 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా ఈవెంట్‌ చేయబోతున్నారని మరో న్యూస్‌ సర్క్యులేట్‌ అవుతోంది. అంతేకాదు, ఈ ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి చీఫ్‌ గెస్ట్‌గా హాజరవుతారనే వార్త మెగాభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఇందులో ఏది కరెక్ట్‌ అనే విషయంలో ఆడియన్స్‌ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెంట్‌ గురించిన సమాచారాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటిస్తే మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు.

‘ఓజీ’ సృష్టిస్తున్న సునామీ గురించి చెప్పాలంటే.. పవర్‌స్టార్‌ బర్త్‌డేకి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. ఇక బుకింగ్స్‌ గురించి చెప్పాలంటే.. నార్త్‌ అమెరికాలో ఈ సినిమా టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ రూపంలో పెద్ద రేంజ్‌లో సేల్‌ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ డేట్‌కి 18 రోజుల ముందే 50 వేలకు పైగా టికెట్స్‌ సేల్‌ అవ్వడం, ఒక్క నార్త్‌ అమెరికాలోనే 12 లక్షల డాలర్ల గ్రాస్‌ రావడం చూస్తుంటే ‘ఓజీ’ సినిమాకి ఎలాంటి క్రేజ్‌ ఉందో అర్థమవుతుంది. ఇప్పటివరకు వినిపిస్తున్న బజ్‌ని చూస్తుంటే గతంలో కలెక్షన్ల పరంగా పవన్‌ కళ్యాణ్‌ క్రియేట్‌ చేసిన రికార్డులను ‘ఓజీ’ అధిగమిస్తుందనే నమ్మకం కలుగుతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.