English | Telugu

‘గోపాల గోపాల’కి అసలు టెస్ట్ మొదలైంది

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి మొదటి రెండు రోజులు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం రెండు రోజులో ఆంధ్రా, తెలంగాణలో పదమూడు కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ‘గోపాల గోపాల’ కలెక్షన్స్‌ సోమవారం ఉదయం నుంచి సడన్ గా డ్రాప్‌ అయినట్లు సమాచారం. చాలా వరకు థియేటర్లు సగానికి పైగా ఖాళీగా వున్నాయట. అయితే బుధవారం నుంచి సంక్రాంతి పండగ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరతారు కనుక ఆందోళన పడాల్సిన పనిలేదని నిర్మాతలు భావిస్తున్నారట. కానీ శంకర్‌ ‘ఐ’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఈ చిత్రానికి కష్టాలు తప్పవని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని గట్టేక్కించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే వుంది. మెసేజ్ ఓరియంటెడ్ కథలతో ఈ ఫీట్‌ సాధించడం అంత సులభమేం కాదు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.