English | Telugu
పవన్ తాతయ్య.. ఇప్పుడు విలన్
Updated : Dec 31, 2014
అత్తారింటికి దారేదితో తెలుగులో అరంగేట్రం చేశాడు బొమన్ ఇరానీ. అందులో పవన్ కల్యాణ్‌కి తాతయ్యగా నటించాడు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ నుంచి ఈ నటుడ్ని ఓ తెలుగు సినిమా కోసం దిగుమతి చేస్తున్నారు. రవితేజ, సంపత్‌నంది కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ సినిమాలో బొమన్ ఇరానీ విలన్‌గా నటించనున్నాడు. ఈనెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చిలో చిత్రీకరణ మొదలు పెడతారు. తమన్నా, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. బొమన్ కోసం చిత్రబృందం భారీ పారితోషికం వెచ్చించిందట. కాల్షీట్లూ అధికంగానే కావల్సివచ్చిందట. తెలుగు నాట మరో కొత్త విలన్‌ని చూడబోతున్నామన్నమాట.